Tuesday, July 15, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఏపీకి షాక్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..

ఏపీకి షాక్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బనకచర్ల ప్రాజెక్టు విషయంలో… ఏపీకి షాక్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు ససేమిరా అంటూ కేంద్రానికి లేఖ రాసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి సమక్షంలో రేపు జరిగే సీఎంల భేటీలో బనకచర్లపైనే చర్చించాలని సింగిల్ ఎజెండా ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు, డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదాపై తెలంగాణ ఎజెండా పెట్టింది. ఈ తరుణంలోనే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు ససేమిరా అంటూ కేంద్రానికి లేఖ రాసింది రేవంత్ రెడ్డి సర్కార్.

రేపు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు బేటే కానున్నారని నిన్నటి నుంచి వార్తలు వచ్చాయి. ఈ భేటీలో జలవివాదాల గురించి మాట్లాడుకోనున్నారని జోరుగా ప్రచారం సాగింది. కేంద్ర జల్ శక్తి మంత్రి నేతృత్వంలో సీఎంలు చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారని పేర్కొన్నారు. కానీ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో… ఏపీకి షాక్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -