ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి హాజరు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్యల వివాహం సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు గద్వాలలో పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శనివారం పటిష్ట పోలీసు బందోబస్తును నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హెలిక్యాప్టర్లో గద్వాలకు చేరుకున్నారు. కలెక్టరేట్ సమీపంలో ఉన్న హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రికి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలు, మొక్కలు అందజేసి, శాలువాలతో సన్మానించారు.
కళ్యాణ వేదిక పైకి చేరుకున్న ముఖ్యమంత్రి నూతన దంపతులకు పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మత్స్య, పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడు మల్లు రవి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజా ప్రతినిధులు, జోగులాంబ జోన్ డీఐజి ఎల్.ఎస్. చౌహన్, జోగులాంబ గద్వాలజిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
గద్వాలలో సీఎం రేవంత్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



