- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని కొత్వాల్‌గూడ ఎకో పార్కును శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీ చుట్టూ వ్యాపారాలు, నైట్ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. ఫామ్‌హౌస్‌లో ఉన్నవారికి పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మహిళలంతా నిండు మనసుతో ఆశీర్వదించాలని అన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు. అందర్నీ కలుపుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపిస్తానని వెల్లడించారు.
- Advertisement -



