Saturday, January 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఓడియన్‌ మాల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఓడియన్‌ మాల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-ముషీరాబాద్‌
ప్రపంచ స్థాయి షాపింగ్‌, డైనింగ్‌, వినోదాల సమ్మేళనంగా ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఏర్పాటు చేసిన అల్ట్రా ప్రీమియం ‘ఓడియన్‌ మాల్‌ను
శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓడియన్‌ మాల్‌ డైరెక్టర్‌ తుల్లా విజయేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఓడియన్‌ మాల్‌ ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌కు ఒక కొత్త అధ్యాయాన్ని తీసుకొస్తుందన్నారు. సినిమా సంస్కృతికి చిరునామాగా నిలిచిన ఈ ప్రాంతంలో మొట్టమొదటి మల్టీప్లెక్స్‌గా ఐనాక్స్‌ ఆధ్వర్యంలో అత్యాధునిక సినిమా థియేటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఎండీ అజహరుద్దీన్‌, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌ కుమార్‌గౌడ్‌, ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ పి.మహేందర్‌ రెడ్డి, ఓడియన్‌ మాల్‌ డైరెక్టర్లు అమర్‌నాథ్‌ వుప్పలంచ, శాంత శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ నర్సయ్య, పీవీఆర్‌ సినిమాస్‌ సీఈఓ ప్రమోద్‌ అరోరా, సైఫ్‌ అలీఖాన్‌, నజాఫ్‌ అలీఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో భారీ పోలీస్‌ బందోబస్తు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో చిక్కడపల్లి, ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. లైబ్రరీ వద్ద జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం సిటీ సెంట్రల్‌ నిరుద్యోగులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ముందస్తు చర్యలుగా భద్రతను కట్టుదిట్టం చేశారు. దాంతో స్థానికంగా కొంత టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -