నవతెలంగాణ – హైదరాబాద్: తమ ప్రభుత్వం మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో మైనార్టీలకు సింహాభాగం ఇచ్చి అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారంఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పవిత్ర మాసం సమాజంలో సఖ్యత, సోదర భావం పరిఢవిల్లాలి అని ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం మీది, నేను మీ సోదరుడిని మనమంతా కలిసి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్దాం అని పిలుపునిచ్చారు. మీ అందరి ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి అవసరం అన్నారు. ఇవాళ వందలాది మంది మైనార్టీ యువతీ యువకులకు విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయంటే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు తీసుకువచ్చిన 4 శాతం రిజర్వేషన్లే కారణం అని సీఎం అన్నారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ద్వారా ప్రభుత్వం సహకరిస్తోందన్నారు.
ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



