ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ, రాహుల్ విషెస్
పలువురు సీఎంలు, సినీ ప్రముఖుల అభినందనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోడీ పోస్టు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బర్త్‌డే విషెస్ తెలిపారు.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న సీఎం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు రాంమోహన్ నాయుడు, బండి సంజరులు రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నారాలోకేష్, సచిన్ పైలట్, కనిమొళి, ఉదయనిధి స్టాలిన్, రాష్ట్ర మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, జూపల్లి కృష్ణారావు తదితరులు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.
సినీ ప్రముఖుల విషెస్
సీఎం రేవంత్‌రెడ్డికి పలువురు సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, అజరుదేవ్‌గన్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. రేవంత్‌రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సేవ చేసే శక్తి కలగాలని పేర్కొన్నారు.



