- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మేడారంలో గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పునఃప్రారంభించారు. అనంతరం తన కుటుంబంతో కలిసి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని సీఎం సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ను రేవంత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -



