- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం పెద్దలతో సీఎం చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే 16 మంది జాబితాను రెడీ చేసిన టీపీసీసీ.. ఆ లిస్ట్‌ను హైకమాండ్‌కు పంపింది. దీనిపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులతో చర్చించనున్నారు. ఆపై ఏఐసీసీ పేర్లను ఖరారు చేయనుంది. రెండు సీట్లలో ఒక స్థానానికి ప్రస్తుత ఎంపీ అభిషేక్ సింఘ్వీని కొనసాగించే అవకాశం ఉంది.
- Advertisement -



