Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఇవాళ ఢిల్లీకి వెళ్ల‌నున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఇవాళ ఢిల్లీకి వెళ్ల‌నున్న సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి సోమ‌వారం ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో జ‌రిగే కార్య‌క్ర‌మానికి హాజ‌రైన త‌ర్వాత అక్క‌డి నుంచి నేరుగా ఆయ‌న శంషాబాద్ విమానాశ్ర‌యానికి చేరుకొని ఢిల్లీ వెళ్తార‌ని సీఎం కార్యాల‌య వ‌ర్గాలు తెలిపాయి. మ‌రోవైపు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే అంశంపై పీసీసీ నియ‌మించిన మంత్రుల క‌మిటీ కూడా నేడు ఢిల్లీ వెళ్తోంది. ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, క‌మిటీ స‌భ్యులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్ సోమవారం ఢిల్లీ వెళ్లి న్యాయ కోవిదులు జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి, అభిషేక్ మ‌ను సింఘ్వీ త‌దిత‌రుల‌తో స‌మావేశ‌మై బీసీ రిజ‌ర్వేష‌న్లుపై అభిప్రాయాలు తీసుకోనున్నారు. కాగా బీహార్‌లో రాహుల్ గాంధీ చేప‌ట్టిన ఓట‌ర్ అధికార్ యాత్ర‌కు హాజ‌ర‌య్యేంద‌కు మంగ‌ళ‌వారం ఢిల్లీ నుంచి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు వెళ్తారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad