నేడు క్లైమెట్ వీక్ కార్యక్రమం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముంబయి బయలుదేరి వెళ్లారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మూడు రోజుల పాటు జరిగే ముంబయి క్లైమెట్ వీక్‌లో కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొంటారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ముంబయి క్లైమెట్ వీక్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటున్నారు. తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ విస్తృత ప్రగతి, పరిపాలన సంబంధిత అంశాల్లో రాష్ట్ర విజయాలను ఈ వేదికపై ఆయన వివరిస్తారు. మూడు రోజులపాటు జరిగే ముంబయి క్లైమెట్ వీక్ అంతర్జాతీయ సదస్సు బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబయి కార్పొరేషన్ భాగస్వాములుగా ఉన్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
ముంబయికి సీఎం రేవంత్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



