ఏర్పాట్లు చేసిన అధికారులు
నవతెలంగాణ-వంగూరు
విజయదశమిని పురస్కరించుకొని సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం తన స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లికి వస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అడిషనల్ కలెక్టర్ అమరేందర్, జిల్లా ఎస్పీ గైకాట్ వైభవ్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి బుధవారం హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంటకు కొండారెడ్డిపల్లి గ్రామానికి రానున్నారు. సాయంత్రం 6 గంటలకు గ్రామస్తులతో కలిసి జమ్మిచెట్టుకు వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా గ్రామం లో ఏర్పాటు చేసిన స్టేజి వద్దకు చేరుకొని కాసేపు గ్రామస్తులతో మాట్లాడతారు. అనంతరం తిరిగి రోడ్డు మార్గాన సీఎం కొడంగల్‌కు వెళ్తారు.