నవతెలంగాణ-హైదరాబాద్ : ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నడుంబిగించింది. అందులో భాగంగానే మంగళవారం మేడారం క్షేత్ర స్థాయి సందర్శనకు సిఎం వెళుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయికి వెళ్లి జాతరకు ముందే ఏర్పాట్ల ప్రణాళిక, ప్రతిపాదనలను పరిశీలించటం ఇదే తొలిసారి. మేడారం పూజరులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై ముఖ్యమంత్రి మంగళవారం మేడారంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి. జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుండడం విశేషం.
నేడు మేడారానికి సిఎం రేవంత్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES