- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పుట్టపర్తిలో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు హెలికాప్టర్లో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో జరిగే బాబా శతజయంతి ఉత్సవాలకు హాజరు కానున్నారు. 11 గంటలకు సాయి కుల్వంత్ సభా మందిరంలో బాబా మహాసమాధి దర్శించుకుంటారు. 11.45 గంటలకు సత్యసాయి విమానాశ్రయం నుంచి తిరుగుపయనం అవుతారు.
- Advertisement -



