Friday, November 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబాలలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

బాలలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి ప్రధాన మంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌నెహ్రూ జయంతి సందర్భంగా సీఎం ఎనుముల రేవంత్‌ రెడ్డి బాలలకు శుభాకాంక్షలు తెలిపారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ బాలల దినోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని సీఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలలను జాతి సంపదగా భావించి, వారి మెరుగైన భవితవ్యానికి కృషి చేయాలని సూచించారు. నెహ్రూ ఆకాంక్షల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నెహ్రూ స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో మెరుగైన మార్పులకు శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. చదువుతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని తెలిపారు. విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని భరోసా ఇచ్చారు. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -