– తప్పును కప్పి పుచ్చుకునేందుకే కేటీఆర్‌పై ఆరోపణలు: మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బనకచర్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దొంగాట ఆడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల మొదటి ఎజెండాగా ఉందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు చెబుతుంటే, చర్చే జరగలేదని రేవంత్ అంటున్నారని ఎద్దేవా చేశారు. చీకటి బాగోతం కప్పిపుచ్చుకునేందుకే డ్రగ్స్, గంజాయి అంటూ మోకాళ్లకు, బోడి గుండుకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ సవాల్ విసిరితే చర్చకు రాని వ్యక్తి, ఆయనపై పిచ్చి వాగుడు మానుకోవాలని హెచ్చరించారు. ”కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో గురుకుల పాఠశాల విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు. గ్రామాల్లో పాలన పడకేసింది. రోజు ప్రజలను కలుస్తా అని మాట ఇచ్చిన వ్యక్తి జూబ్లీహిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ నుంచి పాలన చేస్తున్నారు. సచివాలయానికి ఎందుకు పోవడం లేదో ప్రజలకు చెప్పాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇండ్లపైన కాంగ్రెస్ దాడులకు పాల్పడింది. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల చుట్టూ నిఘా పెట్టారు. మా అందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నవి. మా పై ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ అక్రమాలను ప్రజల్లో ఎండగడుతూనే ఉంటాం” అని హరీశ్‌రావు హెచ్చరించారు.
బనకచర్లపై సీఎం రేవంత్‌రెడ్డిది దొంగాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES