Saturday, November 8, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గం కేంద్రమైన ముధోల్ లోని కొత్త బస్టాండ్ సమీపంలో తెలంగాణ రాష్ట్ర రెండో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మం డల అధ్యక్షుడు రావుల గంగారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి 56వ జన్మదిన వేడుకలను సంతోషంగా జరుపుకొని స్వీట్లు, మిఠాయిల ను పంచుకొని సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్న ఏకైక సీఎం రేవంత్  రెడ్డి అని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకా రం రైతులకు 2 లక్షల రూపాయల ను మాఫీ చేశారన్నారు. అదేవిదంగా ప్రభుత్వ ఆసుపత్రి పండ్లు ను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలోడైరెక్టర్ పతంగి కిషన్,సీనియర్ నాయకులు రావుల శ్రీనివాస్, కిషన్ పటేల్, ప్రేమ్ నాథ్ రెడ్డి,పతంగి కిషన్,కాలీద్ పటేల్,అజిజ్,మురళి,సందూరి యాదవ్,దిగంబర్,ప్రకాష్, భుజంగరావు,అజీజ్ , పల్లె నాగేష్, కాలేవర్ దిగంబర్, జామిల్,బాబు నర్సింలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -