నవతెలంగాణ-పాలకుర్తి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్ లు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తూ అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించడంలో ముందంజలో ఉన్నారని తెలిపారు.
ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. యువతకు సీఎం రేవంత్ రెడ్డి స్ఫూర్తిదాయకమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ డైరెక్టర్ గోనె అశోక్ రెడ్డి, దేవస్థానం మాజీ చైర్మెన్ చిలువేరు కృష్ణ మూర్తి,మాజీ ఎంపిపిలు గడ్డం యాకసోమయ్య, కారుపోతుల శ్రీనివాస్,ఎస్సి సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జలగం కుమార్, జిల్లా నాయకులు పెనుగొండ రమేష్, మొలుగూరి యాకయ్య గౌడ్,మండల ఎస్సి సెల్ అధ్యక్షులు గాదెపాక భాస్కర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు లావుడ్యా భాస్కర్ నాయక్, మండల మహిళా అధ్యక్షురాలు బండిపెళ్లి మనెమ్మ, మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి సలీం, పన్నీరు వెంకన్న, ఎడవెల్లి సోమ మల్లయ్య, నారగోని ఎల్లయ్య,ఎడవెల్లి వెంకన్న, గుగులోతు కిషన్ నాయక్, గాదెపాక ఎల్లయ్య లతోపాటు తదితరులు పాల్గొన్నారు.



