నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను కలవనున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంపై వారితో చర్చించనున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఆవశ్యకతను తెలుపుతూ.. కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజికవర్గాల వారీగా వివరాలపై క్షుణ్ణంగా వివరించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించుకుని కేంద్రానికి పంపిన రెండు బీసీ బిల్లులను లోక్‌సభతో పాటు రాజ్యసభలో ఆమోదించి రాజ్యాగంలోని షెడ్యూల్-9లో పెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలను సీఎం రేవంత్ కోరనున్నారు.
బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES