Monday, July 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనేది సీఎం రేవంత్ రెడ్డి  సంకల్పం చరిత్రత్మాకం

42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనేది సీఎం రేవంత్ రెడ్డి  సంకల్పం చరిత్రత్మాకం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
స్థానికి ఎన్నకల్లో  42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనేది సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం చారిత్రాత్మకమని ఏకే పౌండేషన్ ఛైర్మెన్ కాంగ్రెస్ నాయకులు కట్టే బోయిన అనిల్ కుమార్ అన్నారు. ఆదివారం హాలియా పట్టణంలో తన నివాసం లోమాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల లో బీసీ లకి 42 శాతం అమలుకు సియం రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో క్యాబినేట్ ఆమోదం తెల్పి రాహుల్ గాంధీ  బీసీల అభివృద్ధిన్ని ఆకాంక్షించాలని అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో పొందుపరిచిన విద్యా, ఉద్యోగాలలో, స్థానిక సంస్థలలో బీసీ లకి 42 శాతం రిజర్వేషన్స్ అనే అంశాన్ని  రేవంత్ రెడ్డి  సారద్యం లోని కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధి ని నిరూపించుకుందని అన్నారు.

బీసీ లకి స్థానిక సంస్థ ఎన్నికల లో 42 శాతం అమలుకు తెలంగాణ పంచాయతీ చట్టం -2018  సెక్షన్ 243 డీ(6) ఆర్డినేన్స్ ద్వారా సవరణ చేసిరిజర్వేషన్స్ అమలు చేయాలని కసరత్తు చేయడం అభినందించదగ్గ విషయమని తెలిపారు.రిజర్వేషన్స్ అమలులో కోర్టులో ఏమైనా న్యాయపరమైన సమస్యలు ఎదురైతే ఎదుర్కొనాడానికి అన్ని పార్టీలు సహకరించి బీసీల అభివృద్ధి కి సహకరించాలని కోరారు.ఈ నెల 21 నుండి జరగనున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్స్ బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు.అదే విధంగా బీసీ ల 42 శాతం రిజర్వేషన్ అంశాన్ని,09 వ షెడ్యూల్ లో చేర్చి ఆమోదించాలని డిమాండ్ చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -