Sunday, March 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌ అబద్ధాలు

అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌ అబద్ధాలు

- Advertisement -

రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ పొంగులేటిది కాదని చెప్పడం దుర్మార్గం
మీడియాతో మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిది కాదని ముఖ్యమంత్రి చెప్పడం దుర్మార్గమని అన్నారు. మంత్రి పొంగులేటికి ఆయన భార్య, కొడుకు, తమ్ముడు దూరపు బంధువులు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాఘవ పేరు స్వయాన మంత్రి పొంగులేటి తండ్రి పేరనీ, ఆ కంపెనీ ఆయనదేనని లోకమంతా తెలుసని అన్నారు.

రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ డైరెక్టర్లుగా ఉన్నది పొంగులేటి సతీమణి మాధురి, కొడుకు హర్ష రెడ్డి, తమ్ముడు ప్రసాద్‌రెడ్డి అని గుర్తు చేశారు. అసెంబ్లీని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుదోవ పట్టించారని చెప్పారు. సభలో కాంగ్రెస్‌ ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నదనీ, అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలు చెప్తున్నదని అన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జవాబుదారీతనం లేకుండా సభలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్‌ పాలకుల తీరు శోచనీయమని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -