నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని సందర్శించనున్నారని తెలిపారు. ఆయన పర్యటనకు వచ్చే నాటికి చెరువు అభివృద్ధి పనుల్లో గణనీయమైన పురోగతి కనిపించాలని ఆయన స్పష్టం చేశారు. కమిషనర్ రంగనాథ్ బతుకమ్మ కుంటలో జరుగుతున్న అభివృద్ధి పనులను నేడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
- Advertisement -