- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందడి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం సీఎం హైదరాబాద్‌లోని MCRHRD నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు బయలుదేరుతారు. ఉదయం 11.30 గంటలకు కొడంగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సీఎం తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటింగ్ ముగిసిన వెంటనే ఆయన నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30కి ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి పయనం కానున్నారు.
- Advertisement -



