నవతెలంగాణ-హైదరాబాద్ : నేటి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయింది. ఇవాళ ఉదయం 11 గంటలకు రేవంత్ రెడ్డి… హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నట్లు ముందుగా ప్రకటన వచ్చింది. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం ఉంది.
ఇందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు ముందుగా ప్రకటన వచ్చింది. అనంతరం పలువురు కీలక నేతలతో భేటీ కానున్నట్లు కూడా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కొన్ని అధికారిక కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ఓయూ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని వార్తలు వస్తున్నాయి.