- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులపై పార్టీ పెద్దలతో చర్చించారు. అనంతరం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కులగణన సర్వే, బీసీ బిల్లులపై కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో నేడు ఢిల్లీ నుంచి బయలుదేరిన సీఎం కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు చేరుకున్నారు.
- Advertisement -