Sunday, February 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కన్నాయిగూడెంలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం

కన్నాయిగూడెంలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం

- Advertisement -

నవతెలంగాణ- కన్నాయిగూడెం
మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. తెలంగాణను సాధించి పది సంవత్సరాలు సమర్ధవంతంగా పాలనందించిన మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ పాలన సరైంది కాదని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య తెలిపారు. ఆదివారం కన్నాయి గూడెం మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దాహనం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -