Sunday, February 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని 30 గ్రామ పచాయతీ పరిధిలోని గ్రామాలలో మండల బిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫోన్ టాపింగ్ విషయంలో అక్రమ కేసులు బనాయిస్తూ సీట్ అధికారులు నోటీసులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, అందులో భాగంగా తెలంగాణ కొట్లాడితే వచ్చిన తొలి ముఖ్యమంత్రిని అవమానకరంగా సీట్ అధికారులు పాలక పక్షానికి తొత్తుగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా ఆదివారం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

అందులో భాగంగా మండలంలోని కేంరాజ్ కల్లాలి గ్రామంలో మాజీ సర్పంచ్ సుంకరి వెంకన్న, శివరాజ్ దేశాయ్ ఖండేబెల్లూర్ మాజీ సర్పంచ్, గుండూర్ తాజా సర్పంచ్ సిద్ధపురే కాశీనాథ్, డోన్ గావ్ సర్పంచ్ కే. శ్రీనివాస్, లొంగన్ సర్పంచ్ నాగలిగిద్ది ఉషారాణి సదు పటేల్, జుక్కల్ మాజీ ఎంపీపీ షెట్కార్ బసవంతరావు, ఇలా మండలంలోని పడంపల్లి, నాగల్ గావ్, చండేగావ్, మాదాపూర్, చిన్నగుల్లా, పెద్దగుల్లా, గుల్లతాండ, కౌలాస్, మహమ్మదాబాద్, మైబాపూర్, సాగర్ గావ్, బస్వాపూర్, చిన్న ఏడ్గి, పెద్ద ఏడ్గి, కంటాలి, కత్తల్ వాడి, అంగర్గా, బిజ్జాల్వాడి, మథురా తండా, లాడే గావ్, తదితర గ్రామపంచాయతీ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -