- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్‌కుమార్ సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకంపై చర్చించారు. కొత్త జిల్లాల్లో అవసరమైన చోట కోర్టు భవనాల ఏర్పాటుకు సంబంధించి సీఎం దృష్టికి సీజేఐ తీసుకొచ్చారు. ప్రాధాన్యత వారీగా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
- Advertisement -