Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం సార్..బెస్ట్ అవెలెబుల్ స్కీం లో చదువుకోనివ్వండి

సీఎం సార్..బెస్ట్ అవెలెబుల్ స్కీం లో చదువుకోనివ్వండి

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
సీఎం సార్.. బెస్ట్ అవెలెబుల్ స్కీం లో చదువు కోనివ్వాండి అని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రూ.210 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బెస్ట్ అవెలెబుల్ విద్యార్థులు సోమవారం నగరంలోని ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. బెస్ట్ అవెల బుల్ స్కీం పేరెంట్స్ నిజామాబాద్ కమిటీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ బెస్ట్ అవెలెబుల్ స్కీం బాధిత విద్యార్థి తల్లిదండ్రుల గోస ప్రభుత్వానికి పట్టదా అని ఆవేదన వ్యక్తం చేశారు. బెస్ట్ అవెలబుల్ స్కీంని తొలగించే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలన్నారు. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా పాఠశాలలోనికి వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు ధర్నా నిర్వహిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -