నవతెలంగాణ – కాటారం
జిల్లావ్యాప్తంగా క్లస్టర్ స్థాయి సీఎం క్రీడా పోటీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కాటారం మండల కేంద్రంలో ఎంపీడీవో అడ్డూరి బాబు, ఎంఈఓ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్, కోకో పోటీలు విజయవంతంగా ముగిశాయని క్లస్టర్ ఇన్చార్జి గుర్తింగ విజయలక్ష్మి (పి డి) ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సర్పంచి పంతకాని సడవలి, ఉపసర్పంచి బానయ్య, ములుగు, భూపాలపల్లి జిల్లాల ఆర్ సి ఓ హరి సింగ్, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ మాధవి, పి ఈ టి లు మహేందర్, శ్రీనివాస్, రమేష్ ,వీరన్న, కార్తీక్, వెంకటేష్, పంచాయతీ రాజ్ సెక్రెటరీ షకీర్ ఖాన్,వార్డ్ మెంబర్లు, సీనియర్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
విజయవంతంగా ముగిసిన సీఎం క్రీడా పోటీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



