- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ పున:నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భూమిపూజ చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లోని ఒక భాగాన్ని విడుదల చేసింది. దీని ప్రకారం, 2 వేల చదరపు అడుగుల్లో గర్భాలయం, ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు నిర్మించనున్నారు. రూ.225 కోట్ల వ్యయంతో ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల చదరపు అడుగుల నుంచి 62 వేల చదరపు అడుగులకు పెంచనున్నారు. ఈ పున:నిర్మాణంతో బాసర ఆలయానికి మహర్దశ పట్టనుంది.
- Advertisement -



