Thursday, September 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకామారెడ్డి జిల్లాకు నేడు సీఎం

కామారెడ్డి జిల్లాకు నేడు సీఎం

- Advertisement -
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
    కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. ఇటీవల కురిసి భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, రహదారులను పరిశీలిస్తారు. గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాఫ్టర్‌ ద్వారా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న కుర్దు ఆర్‌అండ్‌బీ బ్రిడ్జ్‌ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి, నష్టం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకుంటారు. అనంతరం కామారెడ్డి మున్సిపాల్టీలో దెబ్బతిన్న రోడ్లను పరిశీలిస్తారు. అలాగే ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో సీఎం సమీక్షిస్తారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -