Monday, February 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'వెన్నం' కుటుంబానికి సీఎం పరామర్శ

‘వెన్నం’ కుటుంబానికి సీఎం పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ-మహబూబాబాద్‌
వెన్నం రాఘవేందర్‌రెడ్డి జీవితం ధన్యమని, ఆయన జీవించి ఉన్నంతకాలం పల్లె ప్రజలకు సేవ చేశారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయన కుమారులు టీపీసీసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ సంవిధాన్‌ కమిటీ సభ్యులు వెన్నం శ్రీకాంత్‌ రెడ్డి, బిగ్‌ టీవీ గ్రూప్‌ ఆఫ్‌ చైర్మెన్‌ వెన్నం విజయ్‌కాంత్‌రెడ్డి సేవలు తెలంగాణకు ఎంతో అవసరమని అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా రెడ్యాల గ్రామానికి చెందిన వెన్నం రాఘవేందర్‌ రెడ్డి ఈ నెల 11న మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం వెన్నం శ్రీకాంత్‌ రెడ్డి, వెన్నం విజయకాంత్‌ రెడ్డి కుటుంబాలను పరామర్శించారు. రాఘవేందర్‌ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెడ్యాల గ్రామ శివారులో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు మధ్యాహ్నం 2గంటల 45నిమిషాలకు హెలికాప్టర్‌ ద్వారా సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వెన్నం సోదరుల ఇంటికి వెళ్లి రాఘవేందర్‌రెడ్డికి నివాళులర్పించారు. శ్రీకాంత్‌ రెడ్డి ఇంట్లో భోజనం చేసి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాన్ని వదలకుండా వ్యవసాయం చేశారని, ఆయన మృతి గ్రామానికి తీరని లోటని అన్నారు. అనంతరం 3.35గంటలకు హెలి ప్యాడ్‌ వద్దకు చేరుకొని దేవాదుల సందర్శన నిమిత్తం వెళ్లిపోయారు. సీఎం రాక సందర్భంగా రెడ్యాల గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం రాకతో రెడ్యాల గ్రామం జనసంద్రంగా మారింది. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కొండా సురేఖ, వేం నరేందర్‌ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్‌, ఎమ్మెల్యేలు డాక్టర్‌ భూక్య మురళి నాయక్‌, రామ్‌చంద్రునాయక్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు ఘనపురం అంజయ్య మున్సిపల్‌ చైర్మెన్‌ గుగులోత్‌ జ్యోతి తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. జిల్లాలో మహబూబాబాద్‌, కే సుందరం, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌ మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -