- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా ఇటీవల నియమితులైన శివప్రతాప్ శుక్లా ఆ హోదాలో తొలిసారి రాష్ట్రానికి వచ్చారు. ఈ మేరకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో రేవంత్ రేడితోపాటు మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఉన్నారు. గవర్నర్ దంపతులతో సీఎం రేవంత్ కాసేపు మాట్లాడారు. రేపు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ కొత్త గవర్నర్‌తో ప్రమాణం చేయించనున్నారు.
- Advertisement -



