– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి
నవతెలంగాణ- కమ్మర్ పల్లి
ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదల వైద్యానికి భరోసా లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో చెందిన ఐదుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. గ్రామానికి చెందిన శంకరాచారికి రూ.24వేల 500, మామిడి మల్లయ్యకు రూ.24వేల 500, తలకొక్కుల మహేష్ కు రూ.13వేలు, శ్రీపాద సంజీవరాణికి రూ.12వేలు, పాతూరి లక్ష్మికి రూ.24వేల ఆర్థిక సహాయం చెక్కులను ప్రభుత్వం మంజూరు చేసింది. అట్టి చెక్కులను కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు.ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ ఎంతోమంది నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఆర్థిక స్వావలంబన పొందుతున్నారన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చెక్కులను అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుడిసే అంజమ్మ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, నాయకులు సింగిరెడ్డి శేఖర్, దూలూరి కిషన్ గౌడ్, ఊట్నూరి ప్రదీప్, వేములవాడ జగదీష్, నల్ల గణేష్ గుప్తా, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదల వైద్యానికి భరోసా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES