నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి పేదల వైద్యానికి ఎంతో భరోసానిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం మండలంలోని ఉప్లూర్ గ్రామంలో 8 మంది లబ్ధిదారులకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కృషితో ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. గ్రామానికి చెందిన తక్కురి రోజాకు రూ. 57వేలు, ధర్పల్లి లక్ష్మికి రూ.16వేలు, పసుపుల రాజుకు రూ.16వేలు, ఆసియా భానుకు రూ.37వేలు, అబ్దుల్ అజీజ్ రూ.28వేలు, కొమ్ముల రాజారెడ్డికి రూ.12వేలు, కుంటి అశోక్ కు రూ.36వేలు, సోమ సాయమ్మకు రూ.27వేల ఆర్థిక సహాయం చెక్కులను ప్రభుత్వ మంజూరు చేసింది.
ఈ చెక్కులను స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఆర్థిక సహాయం చెక్కుల మంజూరుకు కృషిచేసిన సునీల్ కుమార్ కు లబ్ధిదారులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, నాయకులు బోనగిరి లక్ష్మణ్, అవారి సత్యనారాయణ, సుంకరి విజయ్ కుమార్, కొమ్ముల రాజారెడ్డి, మారుపాక నరేష్, ఎనేడ్ల గంగారెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదల వైద్యానికి భరోసా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES