నవతెలంగాణ – దర్పల్లి
రాష్ట్ర పేద ప్రజలకు రేవంత్ సర్కార్ అందిస్తున్న సీఎం ఆర్ ఎఫ్ పథకం ఒక వరంల మారిందని గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం అయన తన కార్యాలయంలో గ్రామానికి చెందిన 20 మందికి చెక్కుల అందించారు. సుమారు రూ. 6 లక్షల మేర పేదలకు ఆస్పత్రుల ఖర్చులకు ప్రభుతం ఆసరా కావడం గొప్ప విషయమని అన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఈ పథకం ద్వారా పేదలకు కోట్ల రూపాయలు వెచ్చించి ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో పేదలు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. చెక్కులు జారీ చేసిన ప్రభుత్వానికి, సహకరించిన ఎమ్మెల్యే గారికి ఈసందర్బంగా అయన ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రములో చేర్మెన్ చెలిమేల మల్లికార్జున్, ఉపసర్పంచ్ శ్రీకాంత్, కాంగ్రేస్ నాయకులు చెలిమేల నర్సయ్య, సదశివ్, గాదె నరేష్, గ్రామానికి చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు.



