జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
నవతెలంగాణ – రామారెడ్డి
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు అందిస్తున్న చెక్కులు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని స్కూల్ తాండకు చెందిన సలావత్ సరోజ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా , సంబంధిత చెక్కును స్థానిక కాంగ్రెస్ నాయకుల తో కలిసి మోహన్ రెడ్డి స్కూల్ తాండాలో అందజేశారు. సరోజ కుటుంబం సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రగోతం రెడ్డి, సల్మాన్, బండి ప్రవీణ్, గంగావత్ రవిoదర్, హైమద్, దయానంద్, శంకర్, ఇర్షాద్, బాబురావు, బొజ్జ, తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు ఆర్థిక భరోసా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



