- Advertisement -
నవతెలంగాణ -ముధోల్ : ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుడ్డు ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈసందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుడ్డు ప్రసాద్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ను సీఎం అభివృద్ధి చేసి ప్రజల దీవేనాలు పొందుతున్నరని అన్నారు. ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



