Monday, April 6, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బాసరలో సీఎం మనుమడు అక్షరాభ్యాసం...

బాసరలో సీఎం మనుమడు అక్షరాభ్యాసం…

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ : దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సోమవారం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి మనుమడుకి అక్షరాభ్యాసం చేయించారు. హైదరాబాదు నుండి సీఎం ప్రతి హెలికాప్టర్లులో కుటుంబ సభ్యులతో కలిసి  బాసరకు వచ్చారు. ఆలయం మండపంలో తన మనవడికి సీఎం దంపతులు, కూతురు, అల్లుడుతో కలిసి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సీఎం కుటుంబ సభ్యులను సన్మానించి, తీర్థప్రసాదాలను  అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ నగేష్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ,ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమరయ్య, ఎమ్మెల్యే లు బోజ్జు పటేల్, మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ , మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -