జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్ష
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జాతీయ స్థాయి స్వీమ్మింగ్ పోటీల్లో కూడా ప్రతిభను చాటాలని ఓలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్దన్ రెడ్డి అన్నారు. ఈనెల 19న హైదరాబాద్లో 10వ తెలంగాణ మాస్టర్స్ రాష్ట్ర స్థాయి స్వీమ్మింగ్ చాంపియన్షిప్ లో ఇందిర ప్రియదర్శిని స్టేడియం స్వీమ్మింగ్ కోచ్లు రాణించడంతో శనివారం వారిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కోచ్ చంద్రకాంత్ 50 మీటర్ల ఫ్రీ స్టైల్లో బంగారు పతకం,100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ లో కాంస్య పతకం, 50 మీటర్ బ్రెస్ట్ స్ట్రోక్, బ్యాక్ స్ట్రోలో కాంస్య పతకం, అలాగే మరో కోచ్ వంశీకృష్ణ 200 మీటర్ ఫ్రీస్టైల్లో రజత, 50 మీటర్ ఫ్రీస్టైల్లో రజత, 50 మీటర్ల బ్రెస్ స్ట్రోక్లో కాంస్య పతకాలు సాధించారని తెలిపారు. వీరు నవంబర్ 21 నుంచి 23వ తేది వరకు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయించారని అలాగే స్పూర్తితో జాతీయ స్థాయిలో కూడా ప్రతిభను చూపాలన్నారు. ఇందులో డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, గిరిజన క్రీడాలాభివృద్ది అధికారి పార్థసారథి, స్వీమ్మింగ్ ఫుల్ నిర్వాహకులు, జిల్లా కబడ్డి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్ జాబాడే, ప్రమెద్, శ్రీనివాస్ గౌడ్, రాజు, కార్తీక్ పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయిలో స్విమ్మింగ్ పోటీల్లో కోచ్ ల సత్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



