Sunday, April 5, 2026
E-PAPER
Homeబీజినెస్నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు తవ్వకాలు..!

నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు తవ్వకాలు..!

- Advertisement -

టాటా స్టీల్‌కు రూ.1,755 కోట్ల డిమాండ్‌ నోటీసు
రాంచీ :
ప్రముఖ ఉక్కు తయారీ దిగ్గజం టాటా స్టీల్‌ లిమిటెడ్‌కు జార్ఖండ్‌ ప్రభుత్వం నుండి భారీ షాక్‌ తగిలింది. నిబంధనలకు విరుద్ధంగా అదనపు బొగ్గు తవ్వకాలు జరిపినట్లు పేర్కొంటూ రామ్‌గఢ్‌లోని జిల్లా మైనింగ్‌ కార్యాలయం ఆ కంపెనీకి రూ.1,755.10 కోట్ల డిమాండ్‌ నోటీసు జారీ చేసింది. ఈ మేరకు టాటా స్టీల్‌ శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సమాచారాన్ని వెల్లడించింది.
జార్ఖండ్‌లోని వెస్ట్‌ బొకారో కొల్లియరీలో 2000-01 ఆర్థిక సంవత్సరం నుండి 2006-07 మధ్య కాలంలో అనుమతించిన పరిమితి కంటే అదనంగా బొగ్గును వెలికితీసినట్లు మైనింగ్‌ శాఖ ఆరోపిస్తోంది. ఈ నిర్దిష్ట కాలంలో సుమారు 1,62,40,399 మెట్రిక్‌ టన్నుల ఖనిజ బొగ్గును నిబంధనలు అతిక్రమించి సేకరించారని నోటీసులో పేర్కొన్నారు. 2026 మార్చి 30 నాటి ఈ నోటీసు ఏప్రిల్‌ 3న తమకు అందినట్లు టాటా స్టీల్‌ తెలిపింది. మైనింగ్‌ శాఖ చేసిన ఈ ఆరోపణలను టాటా స్టీల్‌ తోసిపుచ్చింది. ఈ డిమాండ్‌కు సరైన ప్రాతిపదిక గానీ, తగిన కారణాలు గానీ లేవని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రభుత్వ నోటీసుతో తాము ఏకీభవించడం లేదని, దీనిపై తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. సంబంధిత న్యాయస్థానాల్లో ఈ నోటీసును సవాలు చేయనున్నట్లు టాటా స్టీల్‌ ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -