- Advertisement -
నవతెలంగాణ వెల్దండ
వెల్దండ మండలం పరిధిలోని రాచూర్ గ్రామంలోని వింటేజ్ కాఫీ కంపెనీ వ్యర్థపు నీటితో సమీప పొలాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కంపెనీ రోడ్డుపై మంగళవారం గ్రామస్తులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కంపెనీ నుండి వెలువడే నీటితో పోలాలు దెబ్బతింటున్నాయని, పంటలు పండడం లేదని, పండిన పంటలు రంగు మారి దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవతిసుకొని రైతులకు న్యాయం చేయలని రైతుల కోరారు.
- Advertisement -



