కొత్తగా కాఫీ ప్యాకెట్ లేదా సీసా కొనుగోలు చేసినప్పుడు, అది మొదట్లో మెత్తగా, పొడిగా ఉంటుంది. కానీ, కొన్ని రోజులు గడిచాక, పొడి తేమను గ్రహించి.. గడ్డలుగా మారుతుంది. ఈ సమస్య వల్ల కాఫీ తయారీ కష్టతరంగా మారుతుంది. కాఫీ రుచి కూడా పాడవుతుంది. ఈ సమస్యను నివారించడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. కాఫీ పొడి గడ్డ కట్టడానికి గాలి, తేమ ప్రధాన కారణాలు. అందుకే, కాఫీని ఒక గాజు లేదా గట్టి ప్లాస్టిక్ సీసాలో బిగుతు మూత ఉన్న కంటైనర్‌లో భద్రపరచాలి. వాడిన ప్రతిసారీ సీసా మూత గట్టిగా పెట్టారో లేదో చూసుకోవాలి. పొరపాటున తేమ లోపలికి వెళ్లిందా.. ఒక్క రోజులోనే గడ్డకట్టేస్తుంది. గాలి, తేమ చేరకపోతే కాఫీ పొడి ఎక్కువ కాలం పొడిగా, తాజాగా ఉంటుంది. కాఫీ సీసాను చల్లని, పొడి ప్రదేశంలో ఉంచాలి. వంటగదిలో తడి లేదా వేడి ప్రదేశాలకు దగ్గర్లో… అంటే.. ఉదాహరణకు స్టవ్ లేదా సింక్ దగ్గర కాఫీ సీసాను ఉంచకూడదు. అధిక తేమ లేదా వేడి వాతావరణం… కాఫీ పొడిని త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. బదులుగా, కాఫీని ఒక కూల్, డ్రై క్యాబినెట్‌లో లేదా రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం మంచిది.
అయితే, రిఫ్రిజిరేటర్‌లో ఉంచేటప్పుడు గాలి చేరని కంటైనర్ ఉపయోగించడం మర్చిపోకూడదు. కాఫీ పొడిని తీసేటప్పుడు ఎప్పుడూ పొడి, శుభ్రమైన చెంచా ఉపయోగించాలి. తడి చెంచా లేదా చేతులతో కాఫీ పొడిని తాకడం వల్ల తేమ సీసాలోకి చేరి గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే, ఎప్పుడూ శుభ్రమైన, పొడి చెంచాను ఉపయోగించి కాఫీ పొడిని వాడాలి. పెద్ద సీసాను ఎక్కువసార్లు తెరవడం వల్ల గాలి, తేమ చొరబడే అవకాశం ఉంది. అందుకే, కాఫీని చిన్న చిన్న గాలి చొరచేరని సీసాలలో విభజించి, ఒక సీసాను పూర్తిగా ఉపయోగించిన తర్వాత మరొక సీసాను తెరవడం మంచిది. ఈ విధంగా, కాఫీ ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. కాఫీని తక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం ద్వారా కూడా ఈ సమస్యను నివారించవచ్చు. ఎక్కువ కాలం నిల్వ ఉంచే బదులు.. ఎంత కాఫీ అవసరమో, అంతే కొనుక్కోవడం ఉత్తమం. అప్పుడు గడ్డకట్టే లోపే వాడుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా కాఫీ పొడిని ఎప్పుడూ పొడిగా, తాజాగా ఉంచుకోవచ్చు. రుచికరమైన కాఫీని ఆస్వాదించవచ్చు.
కాఫీపొడి గడ్డకట్టకుండా…
- Advertisement -
- Advertisement -