Wednesday, July 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెసిడెన్షియల్ పాఠశాలలో శీతల వేడుకలు

రెసిడెన్షియల్ పాఠశాలలో శీతల వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ లో మంగళవారం  బంజారా సీతల పండుగ సెలబ్రేషన్ సంబరాలు ప్రిన్సిపాల్ ఆర్ మమత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో  ఏడుగురు దేవతల వేషధారణ, బంజారా కల్చర్ డ్రెస్సెస్ వేసి ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క దేవత నామకరణం చేశారు. ప్రతి సంవత్సరం శీతాల పండగ వేడుకలలో భాగంగా పాఠశాలలో శీతల వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపాల్ ఆర్ మమత, వైస్ ప్రిన్సిపాల్ ఎం అనిత, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ పద్మ,  ఫిజికల్ డైరెక్టర్ శారద, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -