Saturday, December 27, 2025
E-PAPER
Homeబీజినెస్కోల్‌గేట్‌కు రూ.268 కోట్ల పన్ను నోటీసులు

కోల్‌గేట్‌కు రూ.268 కోట్ల పన్ను నోటీసులు

- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ ఓరల్‌ కేర్‌ కంపెనీ కోల్‌గేట్‌ పామోలివ్‌ (ఇండియా) లిమిటెడ్‌ రూ.267.64 కోట్ల పన్ను చెల్లించాలంటూ ఆ కంపెనీకి భారత ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ డిమాండ్‌ నోటీసులను జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను సంప్రదించనున్నట్టు కోల్‌గేట్‌ స్పష్టం చేసింది. ఈ పన్ను నోటీసు వల్ల కంపెనీ ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక స్థితి లేదా రోజువారీ పనులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కోల్‌గేట్‌ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -