Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకుప్పకూలిన వంతెన.. నదిలో పడిపోయిన పర్యాటకులు

కుప్పకూలిన వంతెన.. నదిలో పడిపోయిన పర్యాటకులు

- Advertisement -

నవతెలంగాణ – పుణె: మహారాష్ట్ర పుణే జిల్లాలో ఆదివారం ఘోర ఘటన చోటు చేసుకున్నది. పింప్రి-చించ్వాడ్‌ పీఎస్‌ పరిధిలోని కుందమలలో ఇంద్రయాణి నదిపై వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో 20 నుంచి 25 మంది వరకు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లుగా స్థానిక ఎమ్మెల్యే సునీల్‌ షుల్కే తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం గల్లంతయ్య వారి కోసం గాలిస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన కుందమలకు నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇంద్రయాని నదిని దాటేందుకు వంతెనను నిర్మించారు. ఇటీవల రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వంతెన దెబ్బతిన్నట్లుగా తెలుస్తున్నది. ఈ వంతెన కూలిపోవడంతో పర్యాటకులు నదిలో పడి కొట్టుకుపోయారు. ప్రస్తుతం వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటి వరకు ఆరుగురిని సహాయ సిబ్బంది రక్షించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, వంతెన కూలడంతో ఎంత మంది కొట్టుకుపోయారన్న విషయంలో స్పష్టత లేదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, 20-25 మంది వరకు గల్లంతై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad