- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నిర్మిస్తున్న రామాలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని రామాలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం గ్రామంలో విరళాలు సేకరించారు. ఆయేధ్య రామాలయ స్పూర్తితో గ్రామంలో రామాలయ నిర్మించడం జరుగుతుందని, ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహాకరించాలని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, విడిసి అధ్యక్షులు సూర్యకాంత్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -