Sunday, February 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ

ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలం కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు ఇంటింటికి విరాళాలు సేకరణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆదివారం  ప్రారంభించింది. గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శిస్తూ, స్వామి ఆలయ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని కావాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ద్వారా గ్రామ అభ్యున్నతికి, ఆధ్యాత్మిక వాతావరణానికి ఎంతో తోడ్పడుతుంది అని ప్రతి ఒక్కరి సహకారంతో ఆలయాన్ని శీఘ్రంగా పూర్తి చేయాలన్న దృఢసంకల్పంతో విరాళాల సేకరణ చేపట్టాం అని అన్నారు. ఈ కార్యక్రమం లో శ్రీ వెంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు కళ్లెం భోజరెడ్డి, కళ్లెం మోహన్ రెడ్డి, కుమారి మల్లేష్, దుమ్మాజీ శ్రీనివాస్, తొర్లికొండ సాయన్న, మైలారం గంగారెడ్డి, పెర్కెట్ రమేష్,తొర్లికొండ మహేందర్, కుర్మే చిట్టి, భోజన్న, గంధం రాములు, గాండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -