Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుడిగా కలెక్టర్..

ఉపాధ్యాయుడిగా కలెక్టర్..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
విద్యార్థులు కష్టపడి చదివి పదవ తరగతిలో 100% శాతం ఉత్తీర్ణత సాధించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భగాయత్ జెడ్పీ హై స్కూల్ ని  జిల్లా కలెక్టర్  అకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు గణితాన్ని బోధించారు విద్యార్థులను ఫిజిక్స్ ఫార్ములాలు అడిగి తెలుసుకున్నారు.  పాఠశాలల్లో  విద్యార్థులు ఎంత మంది ఉన్నారని  , అందులో పదవ  తరగతిలో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు రోజు పాఠశాలకు వస్తున్నారా అని  పాఠశాలకు రాని విద్యార్థుల ఇండ్లకు ఫోన్ చేసి ఎందుకు రావట్లేదో ఆరా తీసి క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చే విధంగా చూడాలన్నారు. ఉపాధ్యాయులు కూడా వార్షిక పరీక్షల వరకు ప్రతిరోజు పాఠశాలకు హాజరు కావాలని , అనవసర సెలవులు తీసుకోవద్దని సూచించారు.గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన జిల్లా పదవ తరగతి పరీక్షలల్లో 100% శాతం ఉత్తీర్ణత సాధించేల ఉపాధ్యాయులు ఇప్పటి నుండే విద్యార్థులపై  చొరవ చూపాలని , విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు చెప్పిన విధంగా రోజు శ్రద్ధగా చదువుతూ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. ఏదైనా సబ్జెక్ట్ లో సందేహాలుంటే ఉపాధ్యాయులు ద్వారా నివృత్తి చేసుకోవాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధన కోసం కృషి చేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. కిచెన్ లో వంట సామగ్రిని పరిశీలించి, వంట సరకులైన  కారం ,పసుపు, చింతపండు నాణ్యత సరిగా లేదని వెంటనే మార్చుకోవాలని సూచించారు. పాఠశాలలో  నిర్మాణ పనులు ఆగిన తరగతి గదులను పరిశీలించి , వెంటనే  పనులను మొదలుపెట్టి త్వరతగతిన పూర్తి చేయాలని సంబంధిత పంచాయతీరాజ్ ఏఈ కి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -