Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూభారతిపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

భూభారతిపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
జిల్లాలో భూభారతి, ప్రభుత్వ భూములు, సాధా బైనామాలు, ఎస్ ఐ ఆర్ , మీ సేవ సేవలు, ధాన్యం కొనుగోలు, ఆన్లైన్ ద్వారా ఇసుక సరఫరా అంశాలపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.

బుధవారం మినీ మీటింగ్ హల్ లో జరిగిన సమావేశం లో కలెక్టర్ మాట్లడుతూ భూభారతి  ద్వారా భూముల రికార్డులను క్షే త్రస్టాయిలో పరిశీలించాలన్నారు. రైతులకు పారదర్శక సేవలు అందించాలని తెలిపారు. భూ సమస్యలు, వివాదాలు తక్షణమే పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని అన్నారు .

సాధా బైనామాల సమస్యలను చట్టపరంగా పరిశీలించి, అర్హులైన వారికి న్యాయం చేయాలన్నారు. స్పెషల్  ఇంటెన్షవ్  రెవిషన్ కార్యక్రమం కింద ఓటరు జాబితాలను ఖచ్చితంగా సవరించాలని, బూత్ స్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షించాలని తెలిపారు.

మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను వేగవంతం చేయాలని, దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు . ప్రజలు ఇబ్బందులు పడకుండా పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు.  

జిల్లా లో పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఇసుక రవాణా జరిగేలా మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని అమలు చేయాలని తహసీల్దార్ లకు సూచించారు.దీనివల్ల ఇసుక అక్రమ రవాణాకు ఆస్కారం ఉండదని అన్నారు.జిల్లా లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు సాఫిగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ,రెవిన్యూ డివిజనల్ అధికారులు కృష్ణారెడ్డి,శేఖర్ రెడ్డి,మండల తహసీల్దార్ లు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -